ప్రస్తుత వాతావరణ పరిస్థితులు, కాలుష్యం, ఆహారపు అలవాట్లు, జీవన విధానం వల్ల చాలా మందికి కంటి సమస్యలు వస్తున్నాయి. కొన్ని చిట్కాలు పాటిస్తే మీ కంటి చూపును కాపాడుకోవచ్చు. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం.
- యాంటీ ఆక్సిడెంట్లు, విటమిన్ ఎ, సి ఎక్కువగా ఉండే ఆహారం తీసుకోవాలి.
- ఆకుకూరలు, కూరగాయలు, ఒమేగా-3 ఉండే చేపలను తినాలి. ఇవి కంటి చూపు మెరుగు పడేందుకు దోహదపడతాయి.
- ప్రశాంతంగా నిద్రపోవాలి. అలా చేస్తే కళ్లకు కావాల్సిన విశ్రాంతి లభిస్తుంది. మంచిగా నిద్ర పోతే రోగ నిరోధక శక్తి కూడా మెరుగు పడుతుంది.
- ఇంటి నుంచి బయటకు వెళ్తే కూలింగ్ గ్లాసెస్ తప్పనిసరిగా ధరించాలి. ఇవి సూర్యుడి నుంచి వచ్చే అతినీలలోహిత కిరణాల నుంచి కళ్లకు రక్షణనిస్తాయి.
- రోజు మనం ఎన్నో పనులు చేస్తుంటాం. ఎన్నింటినో తాకుతుంటాం. అదే చేతితో కళ్లను తాకకూడదు. అలా చేస్తే బాక్టీరియా కళ్లలోకి చేరుతుంది