శ్రీకాకుళం జిల్లా లావేరు మండలం మురపాక కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయం మరోసారి ప్రత్యేకత నిలుపుకుంది. రాష్ట్రస్థాయిలో స్వచ్ఛ విద్యాలయంగా ఎంపికైంది. ఈ పురస్కారాన్ని విజయవాడలో నిర్వహించిన కార్యక్రమంలో సీఎం జగన్మోహన్ రెడ్డి చేతుల మీదుగా విద్యాలయం ప్రిన్సిపల్ సుధా అందుకున్నారు.
కాగా ఇటీవల రాష్ట్రస్థాయిలో ఇటీవల మురపాక కేజీబీవీ ప్రథమ స్థానంలో నిలిచిన విషయం తెలిసిందే. కాగా ఇటీవల ఇక్కడి నుంచి బదిలీ అయిన ప్రిన్సిపల్ హైమావతి ప్రత్యేక శ్రద్ధతో ఈ పాఠశాలను నిర్వహించడంతో ఈ అవార్డు దక్కింది. దీంతో విద్యార్థుల తల్లిదండ్రులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.