వరదల వల్ల ప్రస్తుతం బెంగళూరు నగరం నీట మునిగింది. సాఫ్ట్‌వేర్ ఆఫీసులు అధికంగా ఉండే మారతహల్లి, సిల్క్ బోర్డు, ఎలక్ట్రానిక్ సిటీ, ఐటీపీఎల్ ప్రాంతాలన్నీ వరద ముంపునకు గురయ్యాయి. నివాస ప్రాంతాల్లోని ప్రజలను ఇప్పటికే అధికారులు వేరే ప్రాంతాలకు తరలించాయి. అయితే తప్పనిసరి పరిస్థితుల్లో ఆఫీసులకు వెళ్లాల్సిన సాఫ్ట్‌వేర్ ఉద్యోగులు ట్రాక్టర్లను ఆశ్రయిస్తున్నారు. ఈ వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్‌గా మారింది. సాఫ్ట్‌వేర్ ఉద్యోగులకు ఎంత చిక్కొచ్చి పడిందో అని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.