వైఎస్ఆర్ కడప, పులివెందుల: ఆదర్శ పురపాలక నిర్మాణాలలో భాగంగా పట్టణంలోని ప్రధాన మార్గం 64 అడుగులు వెడల్పుతో ఉండేలా చర్యలు తీసుకోవాలని పురపాలక చైర్మన్ వరప్రసాద్, వైకాపా నియోజకవర్గ బాధ్యుడు వైఎస్ భాస్కర్ రెడ్డి, ఓస్డి అనిల్ కుమార్ రెడ్డి అన్నారు. పులివెందుల మున్సిపల్ కార్యాలయంలో సోమవారం ఇళ్ల యాజమాన్లతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ పులివెందులలో సెంట్రల్ బోలేవార్డ్ చేపట్టే ప్రాంతంలో రోడ్డు వెడల్పును 64 అడుగులుగా నిర్ణయించామని, అంతకుమించి ముందుకు ఉన్న ఇళ్ల నిర్మాణాలను స్వచ్ఛందంగా ఇంటి యాజమానులు తొలగించుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.