పీచుపదార్థాలు ఎక్కువగా ఉన్న ఆహారం తీసుకోవాలి. ఆహారంలో బియ్యానికి బదులుగా చిరు ధాన్యాలైన రాగులు, కొర్రలు, సజ్జలు, జొన్నలు తీసుకోవాలి. జామ, దానిమ్మ, అరటిపండు, బత్తాయి, కమలా పండ్లను రోజూ తినాలి. వీటితో పాటు రోజూ 2 అంజీర్ పండ్లు తీసుకోవాలి. కనీసం 3 నుండి 4 లీటర్ల నీరు తీసుకోవాలి. ఉదయం పూట కొంచెం వేడి చేసిన నీరు తీసుకోవాలి. వ్యాయామం చేయాలి. వైద్యుల సలహా మేరకు ఏదైనా ఫైబర్ సప్లిమెంట్ తీసుకోవచ్చు.