ఉమ్మడి జిల్లా పరిధిలో వైద్యఆరోగ్య శాఖలో వివిధ విభాగాలకు సంబంధించి 162 పోస్టుల భర్తీని పగడ్బందీగా నిర్వహించేందుకు వైద్య ఆరోగ్యశాఖ అధికారులు చర్యలు చేపట్టాలని జిల్లా కలెక్టర్ యం. హరి నారాయణన్ సంబంధిత అధికారులను ఆదేశించారు. మంగళవారం కలెక్టర్ క్యాంప్ కార్యాలయంలో వైద్య ఆరోగ్యశాఖలో పోస్టుల భర్తీ ప్రక్రియకు సంబంధించి డిఆర్ఓ ఎన్. రాజశేఖర్, డిఎంహెచ్ఓ ఇతర సంబంధిత అధికారులతో సమీక్ష నిర్వహించారు.