తిరుపతి నగరాభివృద్ధికి మరో కీలక అడుగు ముందుకు పడనుంది. వకుళామాత ఆలయం వద్ద జాతీయ హైవే నుండి చెర్లోపల్లికి నూతన రోడ్డు నిర్మాణం కోసం అధికారులు కసరత్తు ప్రారంభించారు. ఈ రోడ్డు నిర్మాణం పూర్తయితే చెన్నై, బెంగళూరు నుండి తిరుమలకు వచ్చే భక్తులకు ఎటువంటి అసౌకర్యం లేకుండా నేరుగా హైవే మీదుగా చెర్లోపల్లి, జూ పార్క్ మార్గంలో అలిపిరి చేరుకునేందుకు వీలవుతుంది. తద్వారా భక్తులకు ఈ మార్గం సులువుగా మారనుంది.