చిత్తూరు, కుప్పం: రామకుప్పం మండలంలోని చెలిమిచేను జలపాతంలో నీరు ఉధృతంగా ప్రవహిస్తోంది. గత 15 రోజులుగా రామకుప్పం మండలంలో భారీ వర్షాలు కురుస్తుండటంతో జలపాతానికి భారీగా నీరు చేరుకుంది. కౌండిన్య అభయారణ్యంలో ఉన్న జలపాతాన్ని పర్యాటక ప్రాంతంగా అభివృద్ధి చేయాలని మంగళవారం స్థానికులు అధికారులను కోరుతున్నారు. అయితే జలపాతం గుండా ప్రవహించే నీరు మొత్తం వృధాగా తమిళనాడు రాష్ట్రానికి చేరిపోతోంది.