కంటికి రెప్పలా కాపాడాల్సిన మేనమామయే ఆ బాలిక పాలిట కాలయముడయ్యాడు. నెల్లూరు జిల్లాలో ఓ బాలిక నోట్లో యాసిడ్ పోసి, గొంతుకోసిన ఘటన తీవ్ర కలకలం రేపింది. నిందితుడు లైంగిక దాడికి యత్నించగా, ఆమె ప్రతిఘటించడంతో ఈ దారుణానికి పాల్పడినట్టు తొలుత కథనాలు వచ్చాయి. అయితే, ఈ కేసులో పోలీసుల విచారణలో ఆసక్తికర అంశాలు వెల్లడయ్యాయి. ఆ 14 ఏళ్ల బాలికపై దాడి చేసింది మేనమామ నాగరాజు అని పోలీసులు వెల్లడించారు. నాగరాజు వ్యసనాలకు బానిసయ్యాడని, డబ్బు కోసం ఈ ఘాతుకానికి పాల్పడ్డాడని తెలిపారు. ఇదిలావుంటే బాలికపై అత్యాచారం జరగలేదని, నెల్లూరు రూరల్ డీఎస్పీ హరనాథ్ రెడ్డి వెల్లడించారు. నిందితుడిని త్వరలోనే పట్టుకుంటామని అన్నారు. మైనర్ బాలిక ఆరోగ్యం నిలకడగా ఉందని పేర్కొన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa