జగనన్న విద్యాదీవెనకు అర్హత కలిగిన విద్యార్థులు 2022-23 విద్యా సంవత్సరానికి రెన్యువల్ చేయించుకోవాల్సి ఉందని జిల్లా ఎస్సీ సంక్షేమ సాధికారిత అధికారి చెన్నయ్య మంగళవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. దరఖాస్తులను రెన్యువల్ చేయించుకోవడానికి ఈ నెల 30వ తేదీ వరకు అవకాశం ఉందని, ఆయా కళాశాలల ప్రిన్సిపల్స్ వారి విద్యాసంస్థల్లో చదువుతున్న విద్యార్థులకు రెన్యువల్ రిజిస్ట్రేషన్ దరఖాస్తులను పంపిణీ చేయాలని సూచించారు. విద్యార్థుల వివరాలు ఆధారంగా కళాశాల యాజమాన్యం రిజిస్ట్రేషన్ చేయాల్సి ఉందని స్పష్టం చేశారు.