కుల, మత, ప్రాంత, విద్వేషాలు లేకుండా దేశాన్ని ఐక్యంగా ఉంచేందుకు ప్రజలందరినీ సమాయత్తం చేసేందుకు. కాంగ్రెస్ పార్టీ రథ సారథి రాహూల్ గాంధీ చేపడుతున్న 'భారత జోడో యాత్ర' జయప్రదం కావాలన్నారు. అమలాపురం పట్టణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వంటెద్దు బాబి ఆధ్వర్యంలో కాంగ్రెస్ నాయకులు అమలాపురం గణపతి పందిరి లో గణపతికి మరియు సాయిబాబా దేవాలయాల్లో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ. యాత్ర విజయవంతం కావాలని, దేశంలో కాంగ్రెస్ పార్టీ అదికారంలోకి రావాలన్నారు. ఈ కార్యక్రమంలో సీనియర్ నాయకులు పిసిసి సెక్రటరీ యార్లగడ్డ రవీంద్ర , మెల్లేటి వెంకట రమణ, పందిరి శ్రీ నివాస్, చీకట్ల ఫణి, రాయుడు బుజ్జి తదితరులు పాల్గొన్నారు.