తూర్పు గోదావరి: రాజమండ్రి నగరంలో ప్రజలకు సీజనల్ వ్యాధులు ప్రబలకుండా చర్యలు చేపట్టాలని రాజమండ్రి నగరపాలక సంస్థ కమిషనర్ దినేష్ కుమార్ సూచించారు. బుధవారం నగరపాలక సంస్థ కార్యాలయం వద్ద ఆయన అధికారులతో సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు. సీజనల్ వ్యాధుల నివారణకు చేపట్టవలసిన చర్యలపై ఆయన ఆదేశాలు జారీ చేశారు. ఈ కార్యక్రమంలో నగరపాలక సంస్థ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.