పోషక విలువలు ఉన్న ఆహారాన్ని తీసుకుంటే మానసిక ఒత్తిడి, ఆందోళనను దూరం చేసుకోవచ్చు. తాజా పండ్లు, గుమ్మడి విత్తనాలు, బాదంపప్పు, ఆకుకూరలు, జీడిపప్పుల్లో ఉండే మెగ్నీషియం మనసును ప్రశాంతంగా ఉంచుతుంది. బెర్రీలు, నారింజ, జామ పండ్లు కూడా ఒత్తిడిని తగ్గిస్తాయి. వీటిలో యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. గుడ్లు, చేప, చికెన్, తక్కువ కొవ్వు ఉండే పాల ఉత్పత్తులు, చిక్కుడు గింజలు కూడా మెదడుకు మేలు చేస్తాయి.