కేబినేట్ భేటీలో ఏపీ సీఎం జగన్ మంత్రుల పై ఆగ్రహం వ్యక్తం చేశారు. కొందరు మంత్రుల వ్యవహార శైలి సరిగ్గా లేదని, తీరు మార్చుకోకుంటే వేటు తప్పదని హెచ్చరించారు. ప్రభుత్వం అంటే అందరమని కొందరు కాదని సీఎం జగన్ మంత్రులకు హితబోధ చేశారు. ఇద్దరు, ముగ్గురిని తప్పించడానికి కూడా వెనుకాడనని సీఎం జగన్ ఘాటుగా తెలిపారు. దీంతో జగన్ ఆగ్రహానికి గురైన మంత్రులెవరని చర్చ జరుగుతోంది.