జమ్ముకశ్మీర్‌లోని కత్రాలో (Katra) భూకంపం వచ్చింది. గురువారం ఉదయం 7.52 గంటలకు కత్రాలో భూమి కంపించింది. దీనితీవ్రత 3.5గా నమోదయిందని నేషనల్ సెంటర్ ఫర్ సీస్మోలజీ తెలిపింది. కత్రాకు 62 కిలోమీటర్ల దూరంలో భూకంప కేంద్రం ఉన్నదని వెల్లడించింది. భూఅంతర్భాగంలో 10 కిలోమీటర్ల లోతులో భూ కలదలికలు సంభవించాయని పేర్కొన్నది. భూకంపం వల్ల జరిగిన నష్టానికి సంబంధించిన వివరాలు ఇంకా తెలియరాలేదని వెల్లడించింది.