గడివేముల మండలంలోని దుర్వేశి గ్రామానికి చెందిన బాలచంద్రుడు తో కడప జిల్లా లోని పెద్దముడియం మండలం బలపనగూడూరు గ్రామానికి చెందిన నక్క ప్రశాంతితో 8 ఏళ్ళ క్రితం వివాహమైంది. భర్త కొద్దిరోజుల నుంచి భార్యకు శారీరకంగా, మానసికంగా వేధిస్తుండటంతో మంగళవా రం పురుగుల మందు త్రాగి ఆత్మహత్య యత్నానికి పాల్పడింది. నక్క ప్రశాంతి ఫిర్యాదు మేరకు భర్త బాలచంద్రుడు పై కేసు నమోదు చేసినట్లు ఎఎస్సై వెంకటేశ్వర్లు తెలిపారు.