తమిళనాడులోని కన్యాకుమారిలోని అగస్తీశ్వరం నుంచి రాహుల్ గాంధీ రెండవరోజు భారత్ జోడో పాదయాత్ర గురువారం ఉదయం ప్రారంభమైంది. కాంగ్రెస్ నేతలు, కార్యకర్తలు భారీగా తరలివచ్చారు. కాంగ్రెస్ పార్టీ ఎంపీలు కేసీ వేణుగోపాల్, పి.చిదంబరం, ఛత్తీస్గఢ్ సీఎం భూపేష్ బాఘేల్, ఇతరులతో కలిసి రాహుల్ గాంధీ 'భారత్ జోడో యాత్ర'లో భాగంగా తన రెండవ రోజు యాత్రను ప్రారంభించారు. ఈ యాత్ర 150 రోజుల పాటు కొనసాగనుంది.