అమరావతి రైతుల పాదయాత్రకు ప్రజలనుంచి స్పందన లేదని మంత్రి పేర్ని నాని విమర్శించారు. ఆ పాదయాత్రకు కలెక్షన్ ఫుల్.. సానుభూతి నిల్ అని ఎద్దేవా చేశారు. ఉద్యమం పేరుతో వసూళ్ల రాజకీయం చేస్తున్నారని అన్నారు. రాజధాని పేరుతో రియల్ ఎస్టేట్ వ్యాపారం చేశారని ఆరోపించారు. మళ్ళీ ఇప్పుడు పాదయాత్ర అంటూ డ్రామా మొదలు పెట్టారని పేర్ని నాని నిప్పులు చెరిగారు. పేదలకు ప్రభుత్వం స్థలాలు ఇవ్వడం తప్పా?.. రాజధానిలో పేదలు, బడుగులు ఉండకూడదా? అని ప్రశ్నించారు.
ఏపీ ప్రభుత్వంపై కొన్ని మీడియా సంస్థలు పనిగట్టుకుని తప్పుడు ప్రచారం చేస్తున్నాయని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే, మాజీ మంత్రి పేర్ని నాని మండిపడ్డారు. ఈ మేరకు గురువారం మంత్రి పేర్ని నాని తాడేపల్లిలోని వైసీపీ కేంద్ర కార్యాలయంలో మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. టీడీపీ నేతలు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్‌రెడ్డిపై విషం చిమ్మడాన్నే పనిగా పెట్టుకున్నారని దుయ్యబట్టారు.