ఏపీలో దారుణం చోటుచేసుకుంది. భార్య వివాహేతర సంబంధం పెట్టుకుందని తెలిసి భర్త కిరాతకంగా హత్య చేసిన ఘటన చిత్తూరు జిల్లా భాకరాపేటలో జరిగింది. శ్రీకాంత్, రెడ్డమ్మను ఎనిమిదేళ్ల క్రితం ప్రేమ వివాహం చేసుకున్నాడు. వీరికి ఏడేళ్ల కొడుకు ఉన్నాడు. రెడ్డెమ్మ వేరొక యువకునితో వివాహేతర సంబంధం పెట్టుకుందని భర్త శ్రీకాంత్ ఆమెను హత్య చేశాడు. పోలీసులు కేసు నమోదు చేసి పరారీలో ఉన్న శ్రీకాంత్ కోసం గాలిస్తున్నారు