స్టాక్ మార్కెట్లు వరుస నష్టాలకు బ్రేక్ పడింది. ఇవాళ స్టాక్ మార్కెట్లు భారీ లాభాల్లో ముగిశాయి. సెన్సెక్స్ 659 పాయింట్ల లాభంతో 59,688 వద్ద ముగియగా, నిఫ్టీ 174 పాయింట్ల లాభంతో 17,798 వద్ద స్థిరపడింది.
అల్ట్రాటెక్ సిమెంట్, TCS, బజాజ్ ఫైనాన్స్, విప్రో, బజాజ్ ఫిన్ సెర్వ్ కంపెనీల షేర్లు లాభాలు ఆర్జించగా, ICICI బ్యాంక్, HDFC బ్యాంక్, SBI, రిలయన్స్ కంపెనీల షేర్లు నష్టాలు మూటగట్టుకున్నాయి. అయితే అంతర్జాతీయ మార్కెట్లలో నెలకొన్న సానుకూలతలు, క్రూడాయిల్ ధరలు తగ్గడం వంటి కారణాలతో మార్కెట్లలో ఈ కొనుగోళ్ల సందడి కనిపించింది.