వంటింట్లో ఉండే లవంగాలలో ఎన్నో ఔషధ గుణాలున్నాయి. తరచూ వీటిని ఆహారంలో భాగం చేసుకుంటే ఆరోగ్యపరంగా బోలెడు లాభాలున్నాయి. రోగ నిరోధక శక్తిని పెంచడంలోనూ, కండరాల నొప్పిని తగ్గించడంలోనూ ఇవి ఉపయోగపడతాయి. చిగుళ్లు, మూత్ర పిండాల ఆరోగ్యానికి సాయపడతాయి. చర్మ సమస్యలు రాకుండా అడ్డుకుంటాయి. జీర్ణ సమస్యలు, శ్వాసకోశ సమస్యలు తలెత్తకుండా చేస్తుంది. పురుషులలో లైంగిక ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది.