బంగాళాఖాతంలో నేడు అల్పపీడనం ఏర్పడి, 24 గంటల్లో బలపడనుందని IMD ప్రకటించింది. విశాఖ, అనకాపల్లి, అల్లూరి, కాకినాడ, అంబేడ్కర్ కోనసీమ, తూ.గో. జిల్లాల్లో అతి భారీ వర్షాలు కురిసే అవకాశముందని హెచ్చరించింది. శ్రీకాకుళం, విజయనగరం జిల్లాల్లో భారీ వర్షాలు, మిగతా ప్రాంతాల్లోనూ మోస్తరు వర్షాలు కురుస్తాయని పేర్కొంది. మత్య్సకారులు వేటకు వెళ్లాడని, ఇప్పటికే సముద్రంలో ఉన్నవారు వెంటనే తిరిగిరావాలని సూచించింది.