తాను అడుగు బయట పెడితే పోలీసులు అరెస్ట్ చేస్తున్నారని టీడీపీ నేత లోకేష్ ఆరోపించారు. తనపై 15 కేసులు పెట్టారని.. ఏడు సార్లు జైలుకు తీసుకెళ్లారని అన్నారు. ప్రజలకు మంచి చేయాలన్నదే తమ పార్టీ లక్ష్యమని.. వైసీపీ నేతల దాడులకు భయపడేది లేదన్నారు. గతంలో ఎన్నడూ పోలీస్ స్టేషన్ గడప తొక్కని తనకు ఇప్పుడు పోలీస్ స్టేషన్ అత్తారిల్లులా మారిపోయిందని చమత్కరించారు. కేసులకు తాను భయపడే ప్రసక్తే లేదన్నారు.