బెంగాల్ సీఎం మమతా బెనర్జీ కేంద్రంపై మరోసారి తన అసంతృప్తిని వ్యక్తం చేశారు. నేతాజీ విగ్రహావిష్కరణకు ఓ సెక్రటరీ నుంచి లేఖ వచ్చిందని, సాయంత్రం 6 గంటలకు హాజరు కావాల్సిందేనని తనను ఒక సర్వెంట్ ఆదేశించారని తెలిపారు. ఒక సెక్రటరీ.. ముఖ్యమంత్రికి ఎలా లేఖ రాస్తారంటూ ఆమె ప్రశ్నించారు. సాంస్కృతిక శాఖ మంత్రి చాలా పెద్దవారయ్యారని ఎద్దేవా చేశారు. అందుకే కోల్‌కతాలో నేతాజీ విగ్రహానికి పూలమాల వేశానన్నారు.