ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి ప్రతిష్టాత్మక టైమ్స్ ఆఫ్ ఇండియా గ్రూప్ అవార్డు దక్కింది. పోర్ట్ ఆధారిత మౌలిక వసతుల అభివృద్ధిలో ఈ అవార్డు లభించింది. ఆంధ్రప్రదేశ్ దేశంలోనే అత్యుత్తమ రాష్ట్రంగా నిలిచింది. నీతి ఆయోగ్ సలహాదారు సుదేందు జె. సిన్హా నేతృత్వంలోని జ్యూరీ ఆంధ్రప్రదేశ్ ను ఈ అవార్డుకుఎంపిక చేసింది. ఏపీప్రభుత్వం తరపున మంత్రి - గుడివాడ అమర్నాథ్ ఈ అవార్డును అందుకోనున్నారు.