ప్రధాని నరేంద్ర మోదీ సెప్టెంబర్ 12న గ్రేటర్ నోయిడాలో 'IDF వరల్డ్ డైరీ సమ్మిట్ 2022'ని ప్రారంభించనున్నారు, ఇందులో 50 దేశాల నుండి 1,500 మంది ప్రతినిధులు పాల్గొననున్నారు.ఈ మేరకు కేంద్ర మత్స్య, పశుసంవర్ధక & పాడిపరిశ్రమ శాఖ మంత్రి పర్షోత్తం రూపాలా సమావేశంలో ప్రకటించారు.సెప్టెంబరు 12న ప్రధాని శిఖరాగ్ర సదస్సును ప్రారంభిస్తారు. దాదాపు 50 దేశాలకు చెందిన ప్రతినిధులు ఈ కార్యక్రమానికి హాజరుకానున్నారు. నాలుగు రోజులపాటు జరిగే ఈ కార్యక్రమంలో 1,500 మందికి పైగా ప్రతినిధులు హాజరవుతారని మంత్రి తెలిపారు.ప్రధానితో పాటు హోం, సహకార మంత్రి అమిత్ షా, ఇతర కేంద్ర మంత్రులు కూడా సదస్సులో ప్రసంగిస్తారని రూపాలా తెలిపారు.