బెల్లంలో కాల్షియం, మెగ్నీషియం మరియు పొటాషియం వంటి మినరల్స్‌తో పాటు బి కాంప్లెక్స్, సి, బి2 మరియు ఈ వంటి విటమిన్లు ఉంటాయి. బెల్లం అజీర్ణం, మలబద్ధకం, నెలసరిలో చిక్కులు మరియు రక్తహీనత వంటి సమస్యలకు చెక్ పెడుతుంది. రోజూ కొద్దిగా బెల్లం తింటే అధిక రక్తపోటు అదుపులో ఉంటుంది. శరీరానికి శక్తి అందుతుంది. బెల్లం, సోంపు కలిపి తింటే నోటి దుర్వాసన పోతుంది. బెల్లం, నువ్వులు కలిపి తింటే దగ్గు, జలుబు తగ్గుతాయి.