96 ఏళ్ల వయసులో గురువారం కన్నుమూసిన క్వీన్ ఎలిజబెత్ II మృతి పట్ల ప్రధాని నరేంద్ర మోదీ సంతాపం తెలిపారు.మెజెస్టి క్వీన్ ఎలిజబెత్ II మన కాలంలో ఒక ప్రముఖురాలుగా గుర్తుండిపోతుంది. ఆమె తన దేశానికి మరియు ప్రజలకు స్ఫూర్తిదాయకమైన నాయకత్వాన్ని అందించింది అని మోదీ తెలిపారు. రాణి ఎలిజబెత్ అలెగ్జాండ్రా మేరీ విండ్సర్, ఏప్రిల్ 21, 1926న లండన్‌లోని మేఫెయిర్‌లో జన్మించింది. ఆమె తండ్రి కింగ్ జార్జ్ VI ఫిబ్రవరి 6, 1952న మరణించిన తర్వాత, ఆమె 25 ఏళ్ల వయసులో సింహాసనాన్ని అధిష్టించింది.