తమిళనాడులో విషాదం చోటుచేసుకుంది. నీట్ పరీక్షల్లో అర్హత సాధించలేదని ఓ యువతి ఫ్యాన్‌కు ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకుంది. తిరుముల్‌లైవాయల్ ఇందిరా నగర్‌కు చెందిన లక్ష్మీ శ్వేత(19) ప్లస్-2 పూర్తి చేసి రెండేళ్లుగా నీట్ కోచింగ్ తీసుకుంటోంది. బుధవారం అర్ధరాత్రి విడుదలైన నీట్ పరీక్ష ఫలితాల్లో అర్హత మార్కులు సాధించకపోవడంతో శ్వేత ఆవేదనకు గురై ఆత్మహత్య చేసుకుంది. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa