భార్యను చంపేశాడని ఓ భర్తను జైల్లో పెట్టారు. 6 నెలల తర్వాత ఆమె బతికే ఉందని తేలింది. ఈ ఘటన బిహార్ లో జరిగింది. పరిగావన్ కు చెందిన శశి, హీరాదేవి దంపతులకు ఒక కుమారుడు ఉన్నాడు. 7 నెలల కిందట హీరాదేవి అదృశ్యమైంది. దీంతో వరకట్నం కోసం అల్లుడే చంపేశాడని అత్తామామలు కేసు పెట్టారు. శశి 6 నెలల జైలుశిక్ష అనుభవించిన తర్వాత హీరాదేవి బ్రతికే ఉందని తేలింది. ఆమెకు మతిస్థిమితం లేక తప్పిపోయినట్లు వెల్లడైంది.