రాజస్థాన్ జోధ్ పూర్ కు చెందిన రేఖ అనే బాలికకు ఏడాది వయసులోనే ఓ బాలుడికిచ్చి 20 ఏళ్ల కిందట బాల్య వివాహం చేశారు. తాజాగా కాపురానికి రావాలని అత్తింటివారు ఒత్తిడి చేశారు. తనకు చదువుకోవాలని ఉందని, పెళ్లిని ఒప్పుకోనని రేఖ చెప్పడంతో కుల పెద్దలు రూ.10 లక్షలు జరిమానా విధించారు. దీంతో ఆమె ఓ ట్రస్టు సాయంతో ఫ్యామిలీ కోర్టులో పిటిషన్ వేసింది. విచారించిన కోర్టు.. ఆ పెళ్లిని రద్దుచేస్తూ ఉత్తర్వులిచ్చింది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa