ఉద్యోగం నుంచి తొలగించారంటూ ఓ వ్యక్తి ఇటీవల తన స్నేహితులతో కలిసి యజమానిపై పదునైన ఆయుధాలతో దాడి చేశాడు. ఈ ఘటన రాజస్థాన్‌లోని కోటాలో జరిగినట్లు సమాచారం. దాడి జరిగిన తర్వాత వారు అక్కడి నుంచి పరారయ్యారు. దాడిలో గాయపడిన వ్యక్తి ప్రస్తుతం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నట్లు తెలుస్తోంది. ఈ దారుణాన్ని కొందరు వీడియో తీసి సోషల్ మీడియాలో పెట్టారు. నిఖిల్ చౌదరి అనే ట్విట్టర్ ఖాతాలో దాడికి సంబంధించిన వీడియో పెట్టగా నెటిజన్లు స్పందిస్తున్నారు. నిందితులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa