తిరుపతి జిల్లా శ్రీకాళహస్తి పట్టణంలోని సబ్ జైల్ను న్యాయవాదులు, పారా లీగల్ వాలంటీర్లు శనివారం పరిశీలించారు. ఈ సందర్భంగా సబ్ జైలు పరిసర ప్రాంతాలు, వారి వసతి గదులు, బాత్ రూమ్ లు, భోజనశాల పరిశుభ్రతను తనిఖీ చేశారు. తర్వాత ఖైదీలకు పెట్టె భోజనం వారితో పాటు తిని, భోజన సదుపాయాలు బాగున్నాయని ఈ సందర్భంగా వారు అన్నారు. అనంతరం ఖైదీలతో మాట్లాడి సమస్యలపై అరా తీశారు.