కృష్ణంరాజు మృతిపై సినీ, రాజకీయ ప్రముఖులు సంతాపం తెలిపారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా కూడా కృష్ణం రాజు మృతిపై ట్విట్టర్ ద్వారా సంతాపం వ్యక్తం తెలిపారు. కృష్ణంరాజు మృతి చెందడం ఎంతో బాధాకరమని, సామాజిక సేవలోనూ ముందుండే ఆయన రాజకీయాల్లోనూ తనదైన ముద్ర వేసుకున్నారని మోదీ తెలిపారు. కృష్ణంరాజు కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సానుభూతి తెలియజేశారు.