ఏపీలోని బాపట్ల జిల్లా పూసపాడుకు చెందిన దంపతుల హత్య కేసును పోలీసులు ఛేదించారు. హనుమంతరావు-రామతులశమ్మ దంపతుల కుమార్తె అనితకు సాంబశివరావుతో పెళ్లైంది. అయితే రాజ్‌కుమార్ అనే వ్యక్తితో అనిత వివాహేతర సంబంధం పెట్టుకుంది. కొన్నాళ్లకు మరో వ్యక్తికి దగ్గరైంది. ఇది రాజ్‌కుమార్ భరించలేకపోయాడు. అనిత తల్లిదండ్రులను 2021 నవంబర్ 19న చంపేశాడు. శుక్రవారం నిందితుడిని పోలీసులు అరెస్ట్ చేశారు.