ఎస్బీఐ కస్టమర్లు ఇక నుంచి తమ ఫాస్టాగ్ బ్యాలెన్స్ ను సులభంగా తెలుసుకోవచ్చు. ఇందుకోసం మీ రిజిస్టర్డ్ నంబర్ నుంచి 7208820019కి ఎస్‌ఎంఎస్ పంపిస్తే సరిపోతుంది. తాజాగా ఈ సేవలను అందిస్తున్నట్లు ఎస్బీఐ తెలిపింది. ఇందుకోసం మీరు FTBAL అని వ్రాసి 7208820019 నంబర్ కు ఎస్‌ఎంఎస్ పంపాలి. ఒకవేళ మీకు ఒకటి కంటే ఎక్కువ ఎస్బీఐ ఫాస్టాగ్స్ ఉంటే అప్పుడు మీరు FTBAL <వాహనం నెంబర్> అని వ్రాసి 7208820019కి పంపాలి.