2024 లోక్‌సభ ఎన్నికల కోసం భారతీయ జనతా పార్టీ ఔట్రీచ్ కార్యక్రమంలో భాగంగా కేంద్ర మంత్రి అనురాగ్ ఠాకూర్ ఆదివారం మహారాష్ట్రలోని థానేలో పర్యటించారు.ఈ ప్రాంతంలో పార్టీ సంస్థను మెరుగుపరిచే మార్గాలపై చర్చిస్తారని కార్యకర్తలు తెలిపారు.రాహుల్ గాంధీ సారథ్యంలోని కాంగ్రెస్ 'భారత్ జోడో యాత్ర'పై అయన స్పందించారు.దేశాన్ని విచ్ఛిన్నం చేయడానికి పనిచేసిన వారే ఇప్పుడు అలాంటి పాదయాత్రను నిర్వహిస్తున్నారని అన్నారు.మహారాష్ట్రలో ముఖ్యమంత్రి ఏక్‌నాథ్ షిండే, ఉప ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ ఆధ్వర్యంలో కొత్త ప్రభుత్వం రాష్ట్ర అభివృద్ధికి కృషి చేయడం ప్రారంభించిందని ఆయన అన్నారు.