తమ ఉత్పత్తుల అమ్మకాలు పెంచేందుకు ముడుపులు చెల్లించిందన్న కారణంతో డోలో కంపెనీ విమర్శలు ఎదుర్కొంటోంది. డోలో 650 ఎం.జీ. ట్యాబ్లెట్ల సేల్‌ను పెంచడానికి దాని తయారీ సంస్థ డాక్టర్లకు వెయ్యి కోట్ల రూపాయల విలువ చేసే సరుకులను అందజేసిందని.. సీబీడీటీ ఆరోపించింది. ఈ విషయం కోర్టు వరకు వెళ్లింది. అయితే దీనిపై ఐపీఏ పరిశోధన జరిపి.. ఓ నివేదికను అందజేసింది. ఆ నివేదికలో మైక్రో ల్యాబ్స్ కంపెనీకి క్లీన్ చిట్ ఇచ్చింది. ఆ ఆరోపణలు సరికాదని పేర్కొంది. అంతేకాదు మైక్రోల్యాబ్స్‌పై తప్పుగా ప్రచారం చేశారని నివేదికలో వెల్లడించింది.
డోలో-650 ట్యాబ్లెట్లు తయారు చేసిన మైక్రో ల్యాబ్స్ కంపెనీ వాటి వినియోగాన్ని పెంచేందుకు డాక్టర్లకు ఒక ఏడాదిలో రూ.1000 కోట్లు ఇచ్చారనే వార్తలు బయటకొచ్చాయి. సీబీడీటీతో పాటు, ఫార్మా కంపెనీలపై మెడికల్ రిప్రెంజెంటర్లు ఈ ఆరోపణలు చేశారు. అయితే ఈ ఆరోపణలపై దేశీయ ఫార్మా కంపెనీలకు ప్రాతినిథ్యం వహిస్తున్న ఇండియన్ ఫార్మాస్యూటికల్ అలయన్స్ (ఐపీఏ) సంచలన విషయాన్ని వెల్లడించింది.
ఐపీఏ.. నేషనల్ ఫార్మాస్యూటికల్ ప్రైసింగ్ అథారిటీ కి ఓ పరిశోధన నివేదికను అందజేసింది. ఈ మేరకు ఫార్మా కంపెనీ మైక్రో ల్యాబ్స్‌పై వచ్చిన ఆరోపణలపై ఇండియన్ ఫార్మాస్యూటికల్ అలయన్స్ (ఐపిఎ) క్లీన్ చిట్ ఇచ్చింది. వైద్య సంఘాల నుంచి వచ్చిన ఫిర్యాదులను స్వీకరించిన ఎన్ పీపీఏ, యూనిఫాం కోడ్ ఆఫ్ ఫార్మాస్యూటికల్ మార్కెట్ ప్రాక్టీసెస్ (యూసీపీఎంపీ) కింద ఈ విషయాన్ని దర్యాప్తు చేయాలని ఐపీఏను కోరింది. అనంతరం ముగ్గురు సభ్యుల అంతర్గత కమిటీ సమస్యను పరిశీలించింది.
పరిశీలించిన అనంతరం ఐపీఏ వెయ్యి కోట్ల రూపాయల ఉచితాలను అందించిందనేది కరెక్ట్ కాదని తన నివేదికలో పేర్కొంది. కంపెనీ వివరణాలో సింగిల్ బ్రాండ్ డోలో, ఫ్రీబీస్‌పై రూ.1000 కోట్లు ఖర్చు చేసిందనేది కరెక్టకేు కానీ ఒక్క ఏడాదిలో అనేది సరైంది కాదని పేర్కొంది. అంతేకాదు మైక్రోల్యాబ్స్‌పై తప్పుగా ప్రచారం చేశారని వెల్లడించింది.
ఫార్మా గ్రూప్ తన ఉత్పత్తులను ప్రచారం చేయడానికి అనైతిక పద్ధతులను అవలంభించిందని సెంట్రల్ బోర్డ్ ఫర్ డైరెక్ట్ టాక్సెస్ (CBDT) ఆరోపణలు చేసింది. దీనికోసం డాక్టర్లకు ఉచితంగా సుమారు రూ.1000 కోట్ల విలువైన సరుకులు అందజేశారంది. "CBDT ఆరోపణకు సంబంధించి, కమిటీ మరియు ఇండియన్ ఫార్మాస్యూటికల్ అలయన్స్, అసోసియేషన్ ఆఫ్ ఇండియన్ ఫార్మాస్యూటికల్ కంపెనీలకు అటువంటి విషయంపై దర్యాప్తు చేయడానికి ఆదేశం లేదా వనరులు లేవు" అని ఐపీఏతెలిపింది.
ఇదిలావుంటే ఉచితాల వ్యవహారం గత నెలలో సుప్రీంకోర్టుకు చేరింది. దీనిపై విచారణ జరిగింది. ఆ సందర్భంగా జస్టిస్ జస్టిస్ ఎఎస్ బోపన్నతో కూడిన ధర్మాసనానికి నేతృత్వం వహిస్తున్న జస్టిస్ డివై చంద్రచూడ్ ఇది తీవ్రమైన సమస్య అని పేర్కొన్నారు. కరోనా టైంలో తనకు కూడా అదే సూచించారని అన్నారు. కేంద్ర ప్రభుత్వం తరఫున అదనపు సొలిసిటర్ జనరల్ కేఎం నటరాజ్ పది రోజుల్లోగా దీనిపై సమాధానం ఇవ్వాలని ఆదేశించారు. దీనిపై అప్పట్లో పెద్ద చర్చ జరిగింది. కాగా కోవిడ్ సమయంలో ప్రతి ఒక్కరూ డోలోనే వాడేవారు. జ్వరం వస్తే.. చాలా మంది డోలోనే వేసుకుంటున్నారు. అంత విరివిరిగా వీటి వాడకం పెరిగింది.