మేఘాలయలోని వెస్ట్ జైంతియా హిల్స్‌లోని జైలు నుంచి ఆరుగురు అండర్ ట్రయల్ ఖైదీలు శనివారం తప్పించుకున్నారు. జైలు గార్డులను చంపి వారు పరారయ్యారు. అయితే వారిలో నలుగురిని షాంగ్పంగ్ గ్రామంలో ఒక గుంపు కొట్టి చంపినట్లు మేఘాలయ డిజిపి ఎల్ఆర్ బిష్ణోయ్ తెలిపారు. వారి మృతదేహాలను గుర్తింపు కోసం ఆసుపత్రికి తరలించనున్నట్లు బిష్ణోయ్ తెలిపారు. దుండగులు రాడ్లు, కర్రలతో ఖైదీలపై దాడికి పాల్పడినట్లు వివరించారు.