నాగార్జునసాగర్ జలాశయానికి సోమవారం వరద ప్రవాహం తగ్గింది. జలాశయానికి 1, 89, 488 క్యూసెక్కుల నీరు వస్తోంది. సాగర్ పది రేడియల్ క్రస్ట్ గేట్లను పదడుగులు ఎత్తి 1, 45, 760 క్యూసెక్కులు, విద్యుదుత్పాదనతో 32, 886 క్యూసెక్కులు దిగువకు విడుదల చేస్తున్నారు. దీంతో ప్రస్తుతం నాగార్జున సాగర్ జలాశయంలో 587. 80 అడుగుల మట్టంలో 305. 9818 టీఎంసీల నీరు నిల్వ ఉంది.