వివాహిత ఆత్మహత్య చేసుకున్న సంఘటన చిలకలూరిపేటలో ఆదివారం చోటుచేసుకుంది పోలీసులు కథనం ప్రకారం రెడ్డి బజార్ ప్రాంతంలో నీలి శ్యామ్ దీపిక తన భర్త మణి ప్రకాష్ తో కలిసి ఉంటున్నారు. వీరు మూడు సంవత్సరాల క్రితం ప్రేమ వివాహం చేసుకున్నారు. నీలి శ్యామ్ దీపిక ఓ ప్రైవేట్ పాఠశాలలో ఉపాధ్యాయునిగా పని చేసేది. భర్త ఒక షో రూమ్ లో పనిచేస్తున్నారు. ఆదివారం ఉదయం 10 గంటలకు భర్త బయటకు వెళ్లి తిరిగి ఇంటికి వచ్చేసరికి ఉరేసుకొని చనిపోయింది. పోలీసులు కేసు నమోదు చేశారు.