గుంటూరు: అత్యాచారయత్నంపై కేసు నమోదయింది. మేడికొండూరు మండలంలోని ఒక గ్రామానికి చెందిన మహిళ ఆదివారం మధ్యాహ్నం తన ఇంట్లో నిద్రపోతుంది. ఆ సమయంలో అదే గ్రామానికి చెందిన రోశయ్య ఇంట్లోకి ప్రవేశించి తలుపులు వేసి మహిళ నోరు మూసి గొంతు పట్టుకొని కింద పడేశాడు. ఆమె తేరుకొని కేకలు వేయడంతో చుట్టుపక్కల వారు అక్కడకు వచ్చారు. ఇది గమనించి రోశయ్య అక్కడి నుండి పరారయ్యాడు. బాధితురాలి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు.