బెజవాడలోని ఇంద్రకీలాద్రిపై కొలువైన కనకదుర్గమ్మకు ముంబాయికి చెందిన ఓ భక్తుడు విలువైన కానుకలు చెల్లించాడు. మూడు బంగారు కిరీటాలను కానుకగా సమర్పించాడు. నవీ ముంబైకి చెందిన రెకాన్ మెరైన్స్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ యజమాని జి.హరికృష్ణారెడ్డి వీటిని అమ్మవారికి సమర్పించారు. అమ్మవారి ఉత్సవ విగ్రహ అలంకరణ కోసం తయారు చేయించిన ఈ కిరీటాలు ఒక్కోటి 1308 గ్రాముల బరువున్నాయి. ఆలయ ఈవో భ్రమరాంబకు ఆయన వీటిని అందజేశారు. అమ్మవారి దర్శనానంతరం హరికృష్ణారెడ్డి కుటుంబానికి ప్రధానార్చకులు వేదాశీర్వచనం అందించారు. అనంతరం ఆలయ ఈవో ప్రసాదం, అమ్మవారి చిత్రపటం, శేషవస్త్రం అందజేశారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa