ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలలో పేద యువతుల వివాహాలకు ఆర్థిక సాయం అందించే వైఎస్ఆర్ కళ్యాణమస్తు/షాదీ తోఫా పథకాన్ని ఏపీ సర్కారు ఇటీవల ప్రకటించింది. అక్టోబర్ 1 నుంచి ఈ పథకం అమల్లోకి రానుంది. అయితే వధువు వయసు 18, వరుడి వయసు 21 ఉండాలని, వారు టెన్త్ ఉత్తీర్ణత సాధించి ఉండాలని ప్రభుత్వం పేర్కొంది. ఆదాయ పన్ను చెల్లించే వారు, ప్రభుత్వ ఉద్యోగాలు చేసే కుటుంబాలు, కారు ఉన్న వారు దీనికి అనర్హులు. గ్రామ, వార్డు సచివాలయాల ద్వారా ఈ పథకాన్ని అమలు చేయనుంది ప్రభుత్వం.
* ఎస్సీ, ఎస్టీలకు 1 లక్ష రూపాయలు
* ఎస్సీ, ఎస్టీ కులాంతర వివాహాలకు లక్ష 20వేల రూపాయలు
* బీసీలకు 50 వేల రూపాయలు
* బీసీ కులాంతర వివాహాలకు 75 వేల రూపాయలు
* మైనార్టీలకు లక్ష రూపాయలు
* వికలాంగుల వివాహాలకు 1,50,000 రూపాయలు
* భవన నిర్మాణ కార్మికులకు 40 వేల రూపాయలు