కేరళకు చెందిన 72 ఏళ్ల జోసెఫ్ ప్రస్తుతం రైతుగా మారిపోయారు. ఏడేళ్ల క్రితం అమెరికా వెళ్లిన ఆయన డ్రాగన్ ఫ్రూట్ రుచికి మైమరిచిపోయారు. దీంతో స్వస్థలం కొట్టాయానికి సమీపంలోని చెంగనస్సేరీలో డ్రాగన్ సాగు చేపట్టారు. అమెరికా, ఆస్ట్రేలియా, ఫిలిప్పీన్స్, బ్రెజిల్, ఈక్వెడార్ వంటి దేశాల నుంచి 100 రకాల డ్రాగన్ ఫ్రూట్ మొక్కలను రప్పించారు. వాటిని పెంచుతూ ఒక్కో మొక్కను రూ.100 నుంచి రూ.4 వేల వరకు విక్రయిస్తున్నారు.