ముంబైలోని వెస్ట్రన్ ఎక్స్‌ప్రెస్ హైవేపై సోమవారం రాత్రి ఓ కారు మంటల్లో చిక్కుకుంది. అదే సమయంలో అటుగా వెళ్తున్న ముఖ్యమంత్రి ఏక్నాథ్ షిండే ప్రమాదాన్ని గమనించారు. కాలిపోతున్న కారును చూసిన ముఖ్యమంత్రి తన కాన్వాయ్‌ను ఆపి బాధితులను పరామర్శించారు. వారికి అవసరమైన సహాయాన్ని అందజేయాలని అధికారులను ఆదేశించారు. వారికి భరోసా ఇచ్చి అక్కడి నుంచి సీఎం షిండే ముందుకు సాగారు.