కాళ్లు, చేతులపై చర్మం మృదువుగా మారాలంటే రాత్రి పడుకునే ముందు కొబ్బరినూనెను పాదాలకు రాసి మర్దన చేయాలి. ఆ తర్వాత సాక్సులు వేసుకోవాలి. ఇలా ప్రతిరోజూ చేస్తే పొడిబారిన చర్మం మృదువుగా మారుతుంది. గోరువెచ్చని నీటిలో కొద్దిగా వంటసోడా, ఏదైనా నూనెను కొన్ని చుక్కలు వేయాలి. ఇందులో చేతులు లేదా కాళ్లను ఓ10 నిమిషాలు ఉంచి తీసేయాలి. ఇలా చేస్తే కాళ్లు, చేతుల చర్మం మృదువుగా మారుతుంది.