ప్రజలపై దాడి చేస్తున్న క్రూరమైన కుక్కలను చంపాలని కేరళ ప్రభుత్వం యోచిస్తోంది. దీనిపై సుప్రీంకోర్టును ఆశ్రయించాలని తాజాగా నిర్ణయించింది. కుక్కల బెడదను అరికట్టేందుకు రాష్ట్రంలో సెప్టెంబర్ 20 నుంచి నెల రోజుల పాటు డ్రైవ్ నిర్వహించాలని భావిస్తోంది. పరిస్థితి తీవ్రంగా ఉందని, కుక్క కాటు కేసులను నియంత్రించడానికి అనేక ప్రణాళికలను రూపొందించాలని నిర్ణయించామని కేరళ మంత్రి ఎంబీ రాజేష్ అన్నారు.