చిత్తూరు: రామచంద్రాపురం మండలంలోని బీరమాకులకండ్రిగలో మురుగునీరు విషయమై రెండు కుటుంబాల మధ్య వివాదం తలెత్తడంతో జరిగిన ఘర్షణలో పలువురికి గాయాలై సంఘటన సోమవారం చోటుచేసుకుంది. స్థానికుల కథనం మేరకు. మునికృష్ణారెడ్డి, ప్రసాద్ ఇళ్లు ప క్కపక్కనే ఉన్నాయి. ప్రసాద్ ఇల్లు శుభ్రం చేసిన నీరు మునికృష్ణారెడ్డి ఇంటి ముందు పోతుండడంతో మునికృష్ణారెడ్డి తన ఇంటి ముందు నీరు రాకుండా మట్టికుప్ప పోశాడు. మట్టి తొలగించమని ప్రసాద్ కోరగా అందుకు మునికృష్ణారెడ్డి అంగీకరించలేదు. దీంతో మాటామాటా పెరిగి రెండు కుటుంబాల మధ్య ఘర్షణ చోటుచేసుకుంది. ఈ ఘర్షణలో మనికృష్ణారెడ్డి, మోహన్ రెడ్డి, ప్రసాద్, చిట్టెమ్మ గాయపడ్డారు. కేసు దర్యాప్తులో ఉంది.