ఆత్మకూరు: ప్రేమ విఫలమైందన్న క్షణికావేశంలో ఓ విద్యార్థి ఆత్మహత్య చేసుకున్న ఘటన మండలంలోని వడ్డుపల్లిలో సోమవారం చోటు చేసుకుంది. ఎస్ఐ శ్రీనివాసులు తెలిపిన వివరాల మేరకు. బ్రహ్మేంద్ర (20) అనే యువకుడు అనంతపురం ఆర్ట్స్ కళాశాలలో బీకామ్ ఫైనల్ ఇయర్ చదువుతున్నాడు. నిత్యం ఇంటి వద్ద నుంచి కళాశాలకు వెళ్లేవాడు. కళా శాలకు చెందిన ఓ యువతితో ప్రేమలో పడ్డాడు. ప్రేమించిన అమ్మాయి దక్కదన్న ఆవేదనతో సోమవారం ఉదయం ఇంట్లో చీరతో ఉరి వేసుకున్నాడు. కృష్ణవేణి, పరంధామ లకు ఇద్దరు కుమారులు, ఒక కుమార్తె ఉండగా బ్రహ్మేంద్ర పెద్ద కుమారుడు. ఘటనా స్థలాన్ని పరిశీలించిన పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.